- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: చెప్పింది చేసి చూపించాం..!
దిశ, ఏపీ బ్యూరో: ‘ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమైనా ఓ పని మొదలు పెడితే పూర్తి కావడానికి రెండు మూడు ప్రభుత్వాలు మారాల్సిన దుస్థితి ఉండే వైసీపీ ప్రభుత్వంలో అలా కాదు. శంకుస్థాపన, ప్రారంభం కూడా జరిగిందంటే అదే సీఎం జగన్ ప్రత్యేకత. అందుకు నిదర్శనమే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వంశధార నీళ్లందించడం.’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ఏమేరకు పెంచాలమనేదే ముఖ్యమన్నారు. అందుకోసం చేసిన మార్పులు ఓట్ల కోసం కాదని చెప్పారు. ప్రస్తుతం మనకు ఉన్నది ఇద్దరు మామలు. ఒకరు చందమామ అయితే మరొకరు జగన్ మామ అన్నారు. విద్యతోనే పేదరికం తగ్గుతుందని భావించి భావితరానికి మెరుగైన విద్యను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘పిల్లల చదువు కోసం ఐదు రూపాయల వడ్డీకి తీసుకునే అవసరం లేకుండా అమ్మ ఒడి ఇచ్చాం. ఒకప్పుడు పిల్లల చదువు కోసం తల్లులు చాల ఇబ్బంది పడేవారు. ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేసేవాళ్లు. అది చూసి జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. అమ్మ ఒడి పథకాన్ని తీసుకురావడానికి ఇదే కారణం.’ అని మంత్రి సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇన్నాళ్ళూ ఉద్దానం ప్రాంతం వెనుక బడిందన్నారు. జగన్ సీఎం అయ్యాక రూ. 75 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పినట్లు తెలిపారు. రూ.700 కోట్లతో వంశధార నుంచి తాగునీరు తెచ్చి వలసలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం చేపట్టిన ఘనత జగన్‌కే దక్కిందని కొనియాడారు.
చదువుతోనే పేదరికానికి విముక్తి
చదువుతోనే పేదరికానికి విముక్తి అని నమ్మిన నేత జగన్ అని వైసీపీ మంత్రులు తెలిపారు. అందుకోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్తే ప్రతిపక్షానికి నష్టమేంటని నిలదీశారు. విద్యార్థులకు ఇస్తున్న విద్యా కానుక, పౌష్టికాహారం, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు విద్య, ఆరోగ్యం అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చినట్లు మంత్రులు వివరించారు.