శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ..

by Indraja |   ( Updated:2024-03-14 09:41:14.0  )
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ..
X

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధూరను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాహులు టికెట్ ఆశించినప్పటికీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడల సింధూరకి అధిష్టానం టికెట్ ఇవ్వడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో సింధూర రెడ్డికి టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

ఇక పల్లె సింధూర రెడ్డి అనంతపురంలో ఆగస్టు 2వ తారీఖు 1990 శంకర్ రెడ్డి సౌభాగ్యరాణికి జన్మించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 34 సంవత్సరాలు. చదువులో ఎప్పుడూ ముందువరసలో ఉండే సింధూర గోల్డ్ మెడలిస్ట్.. ఆమె నానో టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. కాగా ఆమె విద్యాభ్యాసం అంతా కేరళలో సాగింది. అమృత యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసింది.

సింధూర రెడ్డికి వియాన్ రెడ్డి , కుమార్తె వన్సా ఇద్దరు పిల్లల కలరు. వయస్సు రీత్యా పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్టు నిరాకరిస్తూ యువకులకు ప్రాధాన్యత కల్పించే దిశలో సింధూరకు టికెట్ కేటాయించారు. సింధూరకి టికెట్టు కేటాయించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మహిళలకు టికెట్ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి.

Advertisement

Next Story