- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: నారా లోకేశ్ పక్కన ఆనం.. ఎమ్మెల్యే అనిల్ ఎన్ని మాట్లన్నాడంటే..!
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాదయాత్ర తర్వాత చేయొచ్చు కానీ.. ముందు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలువాలంటూ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు తాను సిద్ధమని, లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు స్టార్ట్ చేశామని గుర్తు చేశారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరే చరిత్ర ఆనం రామనారాయణదని విమర్శించారు. అవినీతి చేసిన ఆనంను పక్కన పెట్టుకుని లోకేశ్ అవినీతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. పార్టీలో ఉన్న కలుపు మొక్కలను తామే పీకి పక్కడ పడేశామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకే నష్టమన్నారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్. జనాలు లేక లోకేశ్ పాదయాత్ర వెలవెలబోతోంది అంటూ ఆదాల కామెంట్స్ చేశారు.