శివాజీ ఆశయాలతో యువత ముందుకు సాగాలి: వాయుగండ్ల వెంకటేశ్వర్లు

by srinivas |
శివాజీ ఆశయాలతో యువత ముందుకు సాగాలి: వాయుగండ్ల వెంకటేశ్వర్లు
X

దిశ, నెల్లూరు: ఛత్రపతి శివాజీ ఆశయాలతో, ఓటమి ఎరుగని ఆయన సంకల్ప బలంతో యువత ముందడుగు వేయాలని వర్చుసా లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వాయుగండ్ల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మొఘల్ సామ్రాజ్యాధిపతికి చెమటలు పట్టించిన వీరుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. బుచ్చిరెడ్డిపాళెం రేబాల వద్ద వర్చుసా రియలస్టేట్ వెంచర్‌లో శివాజీ విగ్రహాన్ని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితం జరిగిన ఛత్రపతి శివాజీ పరిపాలనకు చెక్కు చెదరని ఆనవాళ్లు ఇప్పటికీ చరిత్రలో సజీవంగా ఉన్నాయన్నారు. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలయాపన చేయకుండా తమకు నచ్చిన రంగం వైపు ముందడుగు వేసి మరో కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. వర్చుసా లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్లలో మార్కెటింగ్ మిత్రులుగా పని చేస్తూ, సొంత ఇంటి కళను సాకారం చేసుకొని సంతోషకర జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed