ఆ ఐదు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్లో

by Javid Pasha |   ( Updated:2023-01-22 12:34:51.0  )
ఆ ఐదు నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్లో
X

దిశ నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేస్తూ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. పదికి గాను పది స్థానాల్లో వైపీపీ స్పష్టమైన మెజారిటీతో కనబరిచింది. అయితే 2024 మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికలు ఉంటాయని ఈ సారీ వైసీపీ స్పష్టమైన మెజారిటీ దగ్గక పోగా నాలుగు నుంచి ఐదు స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలతో పాటు రాజకీయ విశ్లేషకులు కుడా చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుందన్న టాక్ నడుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాగా 2024 ఎన్నికల్లో టీడీపీ వైపీపీ మధ్య పోరేతప్ప జనసేన బీజేపీలు నామమాత్రంగానే పోటీలో ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లోపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాపై దృష్టి సాధిస్తే రెండు నుంచి మూడు స్థానాల్లో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వగరన్న అభిప్రాయాలు లేక పోలేదు.. అయితే ప్రస్తుతం జనసేన తూర్పు జిల్లాలపైనే అధికంగా దృష్టిపెడుతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన బీజేపీలు కలిసి పోటీ చేయగా నెల్లూరు నియోజకవర్గాల్లో నాలుగుస్థానాల్లో టీడీపీ గెలుపొందగా ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఒక వేళ మళ్లీ టీడీపీ, జనసేనలు కలిస్తే గత ఎన్నికల కంటే మెరుగ్గా స్పష్టమైన మెజారిటీతో ఇదు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా మూడు నుంచి నాలుగు స్థానాల్లో మాత్రమే గొలుపొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ స్థానాల్లోనే వైసీపీ వీక్

గత ఎన్నికల్లో ఉదయగిరి, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, వెంకటగిరి, నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీచింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పై నియోజకవర్గాల్లో ఫ్యాన్ స్పీడు తగ్గి సైకిల్‌ స్పీడు పెరిగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తుంది.. ఆ స్థానాల్లో మాత్రం స్పష్టమైన మెజారిటీతో టీడీపీకే గెలుపొందే అవకాశం అధికమని సర్వే సంస్థలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరులో మరికొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ నుడుస్తుందని అందులో ముఖ్యంగా గూడూరు. సూళ్ళూరు పేట ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. మిగిలిన స్థానాలు ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లిలో వైసీపీకి అనుకూలంగా ఉందని తెలుస్తుంది.

ఆ స్థానాల్లో టీడీపీకి ఎందుకు బలం

ఉదయగిరి, కావలి నియోజకర్గాల్లో వైసీపీ ప్రభుత్వం తీరు, అంతకంటే అధికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇది టీడీపీకి ప్లస్ అయ్యే అకాశం ఉంది. టీడీపీ హయాంలో జరిగిన కొద్దో గొప్పో అభివృద్ది తప్పితే వైసీపీ అధికారంలోకి వచ్చి చేసిందేమి లేదని ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కూమార్ రెడ్డిపై అవినితీ ఆరోపణలు అధికంగా ఉండటం, నియోజకవర్గంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతుండటం ఒక కారణం అయితే ఆ దాడుల్లో వైసీపీ నేతలు ఉండటం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అభివృద్దిని గాలికి వదిలేసి తన వ్యక్తి గత విషయాలకే పరిమితమైవుతున్నాన్న టాక్ నుడుస్తుంది. దీనికి తోడు స్వంత పార్టీ నేతల నుంచే అయన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలే టీడీపీకి ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అక్కడ ఆ పార్టీ నేతలు కూడా బలంగా ఉండటం టీడీపీకి కలిసొచ్చింది.

- కొవ్వూరు, నెల్లూరు సిటీ, వెంకటగిరి,

నెల్లూరు సీటీ విషయానికి వస్తే మాజీ మంత్రి నారాయణపై ఆ నియోజకవర్గం ప్రజల్లో సానుభూతి ఉంది. మంత్రిగా టీడీపీ హయాంలో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఆయన అభివృద్ది చేశారని ఇసారీ ఎన్నికల్లో నారాయణను గెలిపించుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.. అయితే 2019ఎన్నిల్లోనే నారాయణను గెలవాల్సి ఉంది. అయితే చివరి నిమిషయంలో కార్పొరేటర్ల పార్టీ మారడంతో ఓట్లు చీలి స్వల్ప మెజారీటీతో ఆయన ఓటమి చెందారు. నారాయణపై పోటీ చేసిన మాజీ మంత్రి అనిల్ కూమార్ వైసీపీ నుంచి గెలుపొందారు. 2024 ఎన్నిల్లో మాత్రం నారాయణ సిటీ నుంచి అధిక మోజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రసన్న కూమార్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో రోడ్లపరిస్థితి అధ్వనంగా ఉండటం. వాటిని పట్టించుకునే వారు లేక పోవడం టీడీపీ వాటిని విసృతంగా ప్రచారం చేసుకోగలిగింది. వెంటగిరిలో ఎమ్మెల్యే ఆనంను పక్కన పెట్టి రామిరెడ్డి ప్రతాప్ కూమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారని ఉహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే రామిరెడ్డికి వెంకటగిరి నియోజవర్గంపై పట్టు లేక పోవడం మైస్‌గా మారింది.. దీంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతే టీడీపీని అధికారంలోకి తీసుకువస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- సూళ్ళూరు పేట. సర్వేపల్లి, గూడూరు

సర్వేపల్లి నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతతో సంబంధం లేకుండా నియోజవర్గంలో విఫక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అవసరం సమకూర్చుడంలో ఎమ్మెల్యే‌గా, మంత్రిగా సఫలమైయ్యారు. అతని వద్దకు వచ్చిన చిన్న సమస్యను కూడా పరిష్కరిస్తు ప్రజలు మెప్పును పొందగలిగారు. దీంతో పాటు ఆ నియోజవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది.. గూడూరులో ఎమ్మెల్యేపై వరప్రసాద్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అక్కడ గూడూరులో ఎస్సీ రిజర్వ్వ్ స్థానమైన రెడ్ల పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు ఉన్నాయి.. దీంతో పాటు వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్తాయికి చేరాయి..అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గూడూరుకు చేసిందేమి లేదని ఇలా వివిధ కారణాలతో అక్కడి ప్రజలు టీడీపీపై ఆసక్తి చూపుతున్నారని సమాచారం.. సూళ్ళూరు పేట విదే పరిస్థితి ఉందని అక్కడ టీడీపీ వైసీపీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Amaravathi ని రాజధానిగా కొనసాగిస్తాం.. BJP రాష్ట్ర అధ్యక్షుడు Somu Veerraju

Advertisement

Next Story

Most Viewed