- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: జనసేనలోకి భారీగా చేరికలు
దిశ, నెల్లూరు: నెల్లూరు 6వ డివిజన్‌లోని 33వ వార్డుకు చెందిన పలువురు యువత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మాను క్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి అధిక సంఖ్యలో యువత జనసేనలో చేరుతున్నారని అన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, కరెంటు చార్జీలు , నెల్లూరులో క్రైమ్ విపరీతంగా పెరిగాయన్నారు. కిలో టమోటో ధర 120 రూపాయలు పలుకుతున్నా ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలం చెందిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌తోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.