- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nellore: భగ్గుమన్న దళిత సంఘాల నేతలు.. ఎమ్మెల్యేపై ఆగ్రహం

దిశ, నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తూరు అంబాపురం 1/1 సర్వే నంబర్‌లో దళితులు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే వారిపై ఎమ్మెల్యే అనిల్ ప్రోత్సాహంతో అక్రమంగా కేసులు నమోదు చేశారని పలువురు దళిత సంఘ నేతలు మండిపడుతున్నారు. నెల్లూరు అంబేద్కర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1970లో సుమారు 86 మంది దళితులకు 180 ఎకరాలను పంపిణీ చేశారని రికార్డులతో సహా వారు మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం 1/1 లో 12 ఎకరాల భూముల్లో ఇప్పటికే రెండు ఎకరాలను ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆక్రమించి భవనాలు కూడా నిర్మించారని, వారిపై చర్యలు తీసుకోకుండా మిగిలిన 10 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న దళితులపై కేసులు నమోదు చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులకు ఓ న్యాయం, దళితులకు మరో న్యాయమా అంటూ నిలదీశారు. దళితులకు ఇచ్చిన భూములు ప్రస్తుతం ఎవరి చేతిలో ఉన్నాయో తెలపాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి : వాళ్లను ఆదుకోండి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ