- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > MlA Mock Assembly: నాలుగు గంటలకు పైగా నిల్చున్నా సమయం ఇవ్వలేదు...
MlA Mock Assembly: నాలుగు గంటలకు పైగా నిల్చున్నా సమయం ఇవ్వలేదు...
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసమే అసెంబ్లీలో నాలుగు గంటల 10 నిమిషాల సేపు నిలబడినట్లు చెప్పారు. రూరల్ సమస్యలు ప్రస్తావించేందుకు తనకు స్పీకర్ ఐదు నిమిషాల సమయం కూడా కేటాయించలేకపోయారని వాపోయారు. అదే తనను తిట్టేందుకు నలుగురు మంత్రులకు 40 నిమిషాల సమయాన్ని ఇచ్చారని ఆరోపించారు. మాక్ అసెంబ్లీలో పొట్టే పాలెం, నెల్లూరు రూరల్ సమస్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేవనెత్తారు. స్పీకర్‌గా షంషూద్దీన్ వ్యవహరించారు.
Advertisement
Next Story