- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: ఈసారి ఆయనే సీఎం.. లోకేశ్ సమక్షంలో ఎమ్మెల్యే ఆనం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర యువతకు భవిష్యత్తునిచ్చేది నారా లోకేశ్ అని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో లోకేశ్ 1600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం ఆత్మకూరులో కూడా తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు.
వైసీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆనం ధ్వజమెత్తారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీది విధ్వంసర ప్రభుత్వమని, కొత్త కట్టడాలు తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చేసి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకో పోవాలని.. సైకిల్ రావాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపు నిచ్చారు.