- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Kakani: ఆ ఘనత చిన్న జీయర్ స్వామిదే
దిశ,నెల్లూరు: నేటి ఆధునిక యుగంలో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ, సర్వ మానవాళి శ్రేయస్సుకు చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి అమోఘమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గం, అనంత సాగరం మండలం, సోమశిలలోని నూతనంగా నిర్మించిన గోశాల ప్రారంభోత్సవంలో చిన జీయర్ స్వామితో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 21 శతాబ్దంలో మానవాళికి అత్యంత అవసరమైన వ్యక్తి చిన్న జీయర్ స్వామి అని చెప్పారు. మానవాళి ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సమతామూర్తి రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదని, సుమారు రూ.1000 కోట్లతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చిన జీయర్ స్వామికే దక్కుతుందని స్పష్టం చేశారు. జీయర్ స్వామి ఆధ్వర్యంలో పరమానంద స్వామి మఠం పని చేయడం ఎంతో సంతోషకరమన్నారు. మఠం అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.