Chandrababu Selfie Challange: చూడు జగన్.. ఇవే మేము కట్టిన ఇళ్లు..!

by srinivas |   ( Updated:2023-04-07 13:21:44.0  )
Chandrababu Selfie Challange: చూడు జగన్.. ఇవే మేము కట్టిన ఇళ్లు..!
X

దిశ,డైనమిక్ బ్యూరో: యువగళంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం వైఎస్ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తనయుడి బాటలోకి తండ్రి సైతం చేరారు. చంద్రబాబు నాయుడు సైతం సెల్ఫీ ఛాలెంజ్‌లు విసురుతున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో జోన్-4 సమీక్షలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు.

ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..నువ్వు కట్టిన ఇళ్లెక్కడ...జవాబు చెప్పగలవా? అంటూ జగన్‌కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. తన మైబైల్ ఫోన్‌తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని, ఇప్పటికే క్యాడర్‌కు, లీడర్స్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Nara Lokesh Yuvagalam Day -63: శింగనమల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Malladi Vishnu: లోకేశ్, బాలకృష్ణ పొలిటికల్ జోకర్లు

Advertisement

Next Story

Most Viewed