పవన్‌ను BJP నమ్మడం లేదా.. సోము వీర్రాజు మాటల వెనుక ఆంతర్యమేంటి?

by Satheesh |   ( Updated:4 Feb 2023 11:12 AM  )
పవన్‌ను BJP నమ్మడం లేదా.. సోము వీర్రాజు మాటల వెనుక ఆంతర్యమేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పొత్తులపై మరో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన.. ప్రజల్ని రోడ్లపై వదిలేసే పార్టీలతో మా పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. కలిసి వస్తే జనసేనతో.. లేకపోతే జనంతోనే పొత్తు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సోమువీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు పలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేనతో పొత్తు విషయంలో సోము వీర్రాజుకు అనుమానాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ పవన్ కల్యాణ్‌ను నమ్మడం లేదని.. అందుకే పొత్తుల విషయంలో కమలం వాయిస్ మారుతోందని.. బీజేపీ ఇప్పటి నుండే మానసికంగా ఒంటరి పోరుకు సిద్ధమవుతోందన్న ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా గతంలో జనసేనతో పొత్తు ఉంటుందని నొక్కిచెప్పిన సోము వీర్రాజు.. కలిసి వస్తేనే ఏ పార్టీతో అయిన పొత్తు అన్న తాజా వ్యాఖ్యలు మరిన్నీ అనుమానాలు పెంచుతున్నాయి.

READ MORE

Ap News: త్వరలో బీజేపీ కూడా పాదయాత్ర.. స్పష్టం చేసిన సోము వీర్రాజు


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed