- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫైన్ కట్టినా.. కనెక్షన్ ఇవ్వడం లేదు.. ఎమ్మెల్యేకు రైతుల ఫిర్యాదు

దిశ, భిక్కనూరు : ఫైన్ వేస్తే ఫైన్ కట్టిన... వ్యవసాయ బావి వద్ద కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు ఏఈ అంటే, లైన్ మెన్, ఆయన అంటే ఆయన అంటూ కనెక్షన్ ఇవ్వకుండా ట్రాన్స్ కో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసేందుకు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికకు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా, పలువురు ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.
మండలంలోని గుర్జ గ్రామానికి చెందిన రైతులు కనెక్షన్ ఇవ్వకుండా ట్రాన్స్ కో అధికారులు సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ కరెంట్ కనెక్షన్ ఇచ్చే విధంగా సిబ్బందితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అంతకుముందు రైతు వేదికలో కల్యాణ లక్ష్మి పథకం కింద 16 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 47 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, అగ్రికల్చర్ ఏవో శోభ, మండల బీజేపీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.