నారా భువనేశ్వరికి TCL సంస్థ ప్రతినిధుల సంఘీభావం

by Seetharam |   ( Updated:2023-10-27 06:56:40.0  )
నారా భువనేశ్వరికి TCL సంస్థ ప్రతినిధుల సంఘీభావం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సుయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుంది. ప్రజలు తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మూడోరోజు నిజం గెలవాలి బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే వికృతమాల గ్రామంలో TCL సంస్థ ప్రతినిధులు నారా భువనేశ్వరిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిచెందుకు వెళ్తున్న సమయంలో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. సంస్థకు చెందిన జాసన్, అమరేంద్ర, సురేష్ రెడ్డి తమ పరిశ్రమ మీదుగా వెళ్తున్న భువనేశ్వరిని కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీసీఎల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు అయిందని భువనేశ్వరికి తెలియజేశారు. ఈ సందర్భం గా సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు, ఉద్యోగుల సంఖ్యపై భువనేశ్వరి సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు అయిందని... టీసీఎల్ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభించాయని ప్రతినిధులు భువనేశ్వరికి వివరించారు. పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ముందు భువనేశ్వరి తో ఉద్యోగులు, ఆ సంస్థ ప్రతినిధులు ఫోటో దిగారు. వేల మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థ ఈ ప్రాంతం లో ఏర్పాటు కావడం పై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed