విజయవాడ వరద బాధితులకు సింహాచలం పులిహోర ప్రసాదం

by Mahesh |   ( Updated:2024-09-03 15:27:15.0  )
విజయవాడ వరద బాధితులకు సింహాచలం పులిహోర ప్రసాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో కురిసిన కుంభవృష్టి వర్షానికి తోడు బురమేడ వాగు ఉప్పొంగింది. దీంతో నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సింగ్ నగర్ పూర్తిగా జలదిగ్బందం లోకి వెళ్ళిపోయింది. ఈ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు సార్లు పర్యటించారు. వరద ఉధృతి నెమ్మది నెమ్మదిగా తగ్గుతుండటంతో.. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు వీలైనంత వరకు బాధితులకు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖ పట్టణంలోని సింహాచలం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి తీర్చేందుకు గాను సింహచలం ఆలయం నుంచి.. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. అలాగే మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed