- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
స్కూల్ చుట్టూ ఉన్న షాపులు వెంటనే తొలగించాలి: SFI జిల్లా అధ్యక్షుడు
దిశ, పాణ్యం: పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్లో చదివే ఆడపిల్లలకు, రక్షణ లేకుండా పోయింది అని ఈ విషయం పై గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకపోయిన కూడా పట్టించుకోలేదు. చుట్టు షాప్‌లు ఉండటం వలన స్కూల్‌కు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం లేదు. మందుబాబులకు అడ్డాగా మారిందని SFI జిల్లా అధ్యక్షుడు నెరవాటి రాజా అన్నారు. వీరు మాట్లాడుతూ.. స్కూల్ ప్రాంగణం చుట్టూ షాపులు వెంటనే తొలగించాలని కోరారు. పాణ్యం గ్రామంలోని పాత ఊరి లోపలికి వెళ్లాడని ఇరుగ్గా ఉన్నది.
కావున వెంటనే R&B అధికారులు వెంటనే షాప్‌లపై అధికారులకు నోటిసులు ఇచ్చి తొలగించి వెడల్పు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఎందుకంటే స్కూల్, కాలేజీలకు వందల మంది విద్యార్థులు ఊరిలో నుంచి కాలి నడకతో వస్తుంటారు. ఇరుగ్గా ఉండటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనుమతులు లేకుండా స్కూల్ చుట్టూ ఉన్న షాప్‌లను వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి, నెరవాటి సతీష్ , రవి, విద్యార్థులు పాల్గొన్నారు.