కాకిని బంధించిన చికెన్ షాప్ యజమాని.. మిగితా కాకులన్నీ ఏం చేశాయో తెలిస్తే షాక్

by Rajesh |   ( Updated:2024-07-18 14:15:35.0  )
కాకిని బంధించిన చికెన్ షాప్ యజమాని.. మిగితా కాకులన్నీ ఏం చేశాయో తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కాకి అరిచి విసిగిస్తుందని ఓ చికెన్ షాప్ యజమాని దాన్ని తాడుతో కట్టేశాడు. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి. ఈ విచిత్ర ఘటన ఏపీ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్‌లో చోటు చేసుకుంది. కాకులన్నీ అరవడంతో ఆ గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఐకమత్యమే మహాబలం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed