- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపీ గోరంట్లకు షాక్... హిందూపురం బరిలో శాంతమ్మ
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించిన ఆయన వడపోతలు మొదలు పెట్టారు. పలువురికి సీట్లు నిరాకరించారు. మరికొందరికి స్థాన భ్రంశాలు కలిగించారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జులను నియమించారు. అటు ఎంపీ నియోజకవర్గాల్లో సైతం కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వడంలేదు. ఆ స్థానంలో కర్ణాటకకు చెందిన మాజీ ఉన్నతాధికారి శాంతమ్మను బరిలోకి దించుతున్నారు. దీంతో సీఎం జగన్‌ను కలిసేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని సీఎంను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
కాగా బోయ సామాజిక వర్గానికి శాంతమ్మ 2009 కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2018లోనూ ఆమె పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల వైపు చూస్తున్నారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ పేరును ఖరారు చేశారు. హిందూపురంలో బోయలకు దాదాపు రెండున్నల లక్షల ఓట్లు ఉండటంతో ఆమెకు సీఎం జగన్ సీటు కేటాయించారు.బోయలకు హిందూపురంలో సరైన రాజకీయ ప్రాధాన్యం లేదనే విమర్శ ఉంది. ఈ విమర్శను తిప్పికొట్టేందుకు శాంతమ్మకు సీఎం జగన్ హిందూపురం ఎంపీ సీటును కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఆమె పుట్టినిల్లు అయితే గుంతకల్లు మెట్టునిల్లు. దీంతో శాంతమ్మకు గుంతకల్లుతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.