- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్.. వాటిని నిర్వహించాలని సంచలన డిమాండ్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం(YCP Government) తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాల(medical college)లను ప్రైవేటు చెయ్యాలని ప్రభుత్వం(Government) నిర్ణయించడం దారుణం అన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయించినా.. వాటిని రద్దు చెయ్యమని సీఎం చంద్రబాబు ప్రభుత్వం NMCకి లేఖ రాయడం దుర్మార్గమైన చర్య అని రోజా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) తన పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను (Government medical college)తీసుకురాలేదని అన్నారు.
ఈ క్రమంలో జగనన్న ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను PPP విధానం పేరుతో ప్రైవైట్ పరం(Private) చేయాలనుకోవడం క్షమించరాని నేరం అంటూ రోజా ఫైరయ్యారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం సరియైన విధానం కాదని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రతిభ(Talent) గల పేద విద్యార్థులకు వైద్య విద్యను(Medical Education) దూరం చేయాలనుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలనలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాలలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి మంచి ప్రజల్లో చర్చ జరుగుతుందని ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం..!!
— Roja Selvamani (@RojaSelvamaniRK) September 15, 2024
రాష్ట్రంలో @ysjagan ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. పులివెందుల మెడికల్ కళాశాలకు… pic.twitter.com/VIMqz4tZDD