KA Paul : కుంభమేళా తొక్కిసలాటపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
KA Paul : కుంభమేళా తొక్కిసలాటపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్(UP) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌(PrayagRaj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbhamela)లో ఘోర తొక్కిసలాట(Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మరణించారని, 60 మంది దాకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా యూపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanthi Party Cheif KA Paul) తీవ్ర ఆరోపణలు చేశారు. కుంభమేళా తొక్కిసలాటలో 300 మంది చనిపోతే కేవలం 30 మంది మాత్రమే మరణించారని యూపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలోని నిజానిజాలు బయట పెట్టేందుకు తాను సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేస్తానన్నారు.

డిసెంబర్లో తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట(Tirumala Stampede) జరగి ఆరుగురు ప్రాణాలు వదలడం.. రెండు నెలలు గడవక ముందే కుంభమేళాలలో మరోసారి తీవ్ర తొక్కిసలాట వందల మంది చనిపోయారని.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇలాంటి విషాద ఘటనలు జగరకుండా ముందుగానే గట్టి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇలాంటి వేడుకల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేయాలని కేఏ పాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగిన ఘటనలో 30 మంది భక్తులు మృతి చెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. త్రివేణి సంగమం వద్ద మౌని అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తానికి ముందు బుధవారం తెల్లవారుజామున 1 నుండి 2 గంటల మధ్య అఖారా మార్గ్‌లో పెద్ద సంఖ్యలో ఘాట్ లకు చేరుకున్న భక్తులు త్రివేణి సంగంలో ఒక్కసారిగా స్నానాలు చేసేందుకు ఎగబడటంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగింది. గాయపడిన క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్(UP CM Yogi AdithyaNath) సర్కార్ దిద్ధుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన యోగి సర్కార్ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. జస్టిస్ కృష్ణ కుమార్Justice (Krishna Kumar Committee) నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 15 రోజుల్లో రిపోర్టు సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు యూపీ సీఎం స్పష్టం చేశారు. అలాగే.. తొక్కి సలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‎గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.

Next Story

Most Viewed