ఏపీ ప్రభుత్వానికి సోమేష్ కుమార్ రిపోర్ట్!

by GSrikanth |
ఏపీ ప్రభుత్వానికి సోమేష్ కుమార్ రిపోర్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ సీఎస్ పదవిని కోల్పోయిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. గురువారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అంతకు ముందు ఇవాళ విజయవాడ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన సోమేష్ కుమార్ వీఆర్ఎస్ స్పందించారు. భారత ప్రభుత్వం ఆదేశాలతో ఏపీకి వచ్చానన్నారు. అధికారులకు ఏ పోస్టు తక్కువ, ఎక్కువ కాదని.. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పనిని నిర్వర్తిస్తానన్నారు. వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్తున్నారనే ప్రచారంపై స్పందించిన ఆయన.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏపీలో క్యాడర్ లో చేరిన సోమేష్ కుమార్ కు జగన్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తుందా లేక వెయిటింగ్ లో ఉంచుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story