నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కు భద్రత తగ్గింపు.. కన్నీరు పెట్టుకున్న గన్‌మెన్లు

by Mahesh |   ( Updated:2023-02-05 13:40:14.0  )
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కు భద్రత తగ్గింపు.. కన్నీరు పెట్టుకున్న గన్‌మెన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సైడ్ చేసేందుకు వైసీపీ ప్లాన్ వేసింది. కానీ ఆయనే తాను వైసీపీ దూరంగా ఉంటున్నట్లు పేర్కొని.. జగన్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రుల, ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యేగా ఆయనకు ఉన్న భద్రతను వైసీపీ ప్రభుత్వం తగ్గించింది.

దీంతో.. తనపై కక్ష సాధింపులో భాగాంగానే జగన్ ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఇన్ని రోజులు తనతో పాటు ఉన్న ఇద్దరు గన్మెన్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీడ్కోలు పలికాడు. కాగా ఆ సమయంలో ఆయన గన్ మెన్లు కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారీ.. జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

READ MORE

సార్ నిన్ను విడిచివెళ్లిపోతుంటే బాధగా ఉందంటూ... కన్నీళ్లు పెట్టుకున్న కోటంరెడ్డి గన్‌మెన్లు

Advertisement

Next Story