కాణిపాకంలో సెక్యూరిటీ వైఫల్యం.. వినాయకుడి మూలవిరాట్ ఫోటో వైరల్

by Sathputhe Rajesh |
కాణిపాకంలో సెక్యూరిటీ వైఫల్యం.. వినాయకుడి మూలవిరాట్ ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకంలోని వినాయకుడి మూల విరాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. స్వయంభుగా వెలిసిన వినాయకుడి విగ్రహాన్ని పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి దంపతులు ఫోటో తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.

రెండు రోజుల క్రితం కాణిపాకం దర్శనానికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంకట్ రెడ్డి అనుచరులు ఫోటో తీస్తుండగా ఆలయ సిబ్బంది అడ్డుచెప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో వైరల్ అయ్యాయి. అయితే ఇది సెక్యూరిటీ వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో వినాయకుడి విగ్రహ ఫోటోలను పోస్ట్ చేసిన వారు డిలీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed