- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనంతపురంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ పై సెబ్ పోలీసుల దాడి దారుణం: అచ్చెన్నాయుడు

X
దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డిపై తాడిపత్రి సెబ్ పోలీసుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిని వదలి అమాయకులపై ప్రతాపం చూపటం ఏంటి? అని నిలదీశారు. ముద్దాయి ఎవరో తెలియకుండా పోలీసులు దాడి చేసి గాయపర్చటం సెబ్ పనితీరుకు అద్దం పడుతోంది అని విమర్శించారు. గాయపడిన చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు భాద్యులైన సెబ్ పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Next Story