Tirupati: సమ్మెకు సిద్ధమవుతోన్న మరో శాఖ ఉద్యోగులు

by srinivas |   ( Updated:2023-12-25 16:27:11.0  )
Tirupati: సమ్మెకు సిద్ధమవుతోన్న మరో శాఖ ఉద్యోగులు
X

దిశ, తిరుపతి: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగడానికి ఉద్యోగుల సంఘం తీర్మానం చేశారు. ఇటీవల యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమవ్వడంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2500 మంది పారిశుధ్య సిబ్బంది, ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ప్రధానంగా తొమ్మిది డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మునిసిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. గత నెలలోనే ఉద్యోగ సంఘాలు జిల్లా కలెక్టర్, కమిషనర్లకు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం విదితమే.. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వస్తోందని కార్మిక సంఘాల నాయకుడు విశ్వనాధ్, వర్మ తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూనియన్ నేతలతో సమావేశం నిర్ణయించి సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed