- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఒక రాయి ఇద్దరికి తగిలిందంటే సీరియస్‌గా చూడాల్సిందే’
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారమే జగన్‌పై దాడి చేయించారని ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్లాన్ ప్రకారం చేసిన హత్యాయత్నమే అని అన్నారు. బుర్ర ఉన్న వారు ఎవరైనా కంటికి గాయం చేసుకోవాలనుకుంటారా? అని విమర్శలు చేస్తున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు నటించడం రాదని అన్నారు. చంద్రబాబు నటన అలవాటు అని మండిపడ్డారు. రాళ్లలో కొట్టాలని ఇటీవల టీడీపీ నేతలను చంద్రబాబు రెచ్చగొట్టారని గుర్తుచేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కచ్చితంగా వాళ్లే చేశారు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిగా విసిరిన రాయి కాదని.. చాలా బలంగా తగిలిందంటే కావాలని కుట్రపూరితంగా విసిరిన రాయే అన్నారు. ఒకే రాయి ఇద్దరికి తగిలింది అంటే కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన రాయి కూడా దొరకలేదని.. వెపన్ లాంటిది ఏదైనా ఉపయోగించారేమో అనే అనుమానం కూడా కలుగుతోందని అన్నారు.