- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బైక్ పై తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఘాట్ రోడ్డులో టూవీలర్స్‌పై ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల తిరుపతి మొదటి స్థానంలో ఉంటుంది. పూర్తిగా కొండలు, అడవిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే సోషల్ మీడియా ప్రాభల్యం పెరిగిన తరుణంలో యువకులు ఎక్కువగా బైక్ లపై తిరుమలకు వెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం గుట్ట కింద బైక్ ట్యాక్సీలు అద్దెకు దొరుకుతాయి. అయితే భారీగా వర్షాలు కురవడం, వణ్యప్రాణులు రోడ్లపైకి వస్తుండటంతో తరుచు ఎక్కడో ఒక చోటు టువిలర్‌లకు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తమిళనాడుకు చెందిన యువ జంట బైక్ పై తిరుమల కొండకు వెళ్తుండగా ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందారు.
దీనికి తోడు వణ్య ప్రాణులు సాయంత్రం సమయంలో రోడ్లపైకి వస్తుండటంతో తిరుమల అధికారుల అప్రమత్తమయ్యారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం.. తిరుమల ఘాట్ రోడ్డులో టూవీలర్స్‌పై ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కొండపైకి బైక్ పై వెళ్లేవారికి అనుమతించనున్నారు. అలాగే ఈ ఆంక్షలు నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయని తెలిపారు. నిన్న రాత్రి కూడా మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచరించింది. దీంతోనే తిరుమల కొండపైకి బైక్స్ రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు టీడీడీ ప్రకటించింది.