- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి స్వల్ప ఊరట దక్కింది. ఈ కేసులో అచ్చెన్నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడిని సీఐడీ ఏ-38గా చేర్చింది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం అచ్చెన్నాయుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. 52 రోజుల పాటు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.