- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్రమంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన రామ్మోహన్ నాయుడు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంలో టీడీపీ, జనసేనకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రానికి స్పీకర్‌తో పాటు కేంద్రమంత్రులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి రాబోతోందని ప్రచారం జరుగుతుంది. చిన్న వయసులోనే ఎంపీగా మూడు సార్లు గెలిచినందున ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు స్పందించారు. రూమర్లు వస్తున్నాయని, కాని వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని తేల్చిచెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎలాంటి పదవులు కోరుకోనని, టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదే టీడీపీ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం చాలా వెనుకబడిందని, ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రంతో కలిసి నడుస్తున్నామని తెలిపారు. కేంద్రంలో టీడీపీ ఒక బలమైన శక్తిగా ఉంటుందని.. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఎలా అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో.. ఇప్పుడు కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.