- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరసవిల్లి దేవాలయానికి రూ.100 కోట్లు ఇవ్వండి: షెకావత్‌ను కోరిన రామ్మోహన్ నాయుడు
దిశ, వెబ్ డెస్క్: అరసవిల్లి సూర్యదేవాలయం(Arasavilli Surya Temple) అభివృద్ధిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) దృష్టా సారించారు. ఈ మేరకు రూ. 100 కోట్లు నిధులు ఇవ్వాలని కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో కేంద్రమంత్రి షెకావత్(Union Minister Shekhawat)ను కలిసిన ఆయన ప్రసాద్ పథకంలో అరసవిల్లిని చేర్చాలని కోరారు. అరసవిల్లిని అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని షెకావత్‌కు రామ్మోహన్ నాయుడు వివరించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గండికోట అభివృద్ధిని ప్రస్తావించారు. గండికోట, రాజమహేంద్రవరం పర్యాటక అభివృద్ధికి నిధులు విడుదల చేయడంపై కేందమంత్రి షెకావత్‌కు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. గండికోటకు ప్రత్యేక గుర్తింపు ఉందని వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.