నా కొడుకు, నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాం: మాజీ మంత్రి దగ్గుబాటి షాకింగ్ డెసిషన్

by Satheesh |   ( Updated:2023-01-15 04:26:05.0  )
నా కొడుకు, నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాం: మాజీ మంత్రి దగ్గుబాటి షాకింగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను, తన కూమారుడు హితేష్ ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నామని వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గత రాజకీయాలకు.. నేటీ రాజకీయాలకు పొంతన లేదని.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో తాము ఇమడ లేమని.. అందుకే రాజకీయాల నుండి తప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు. డబ్బు రాజకీయాలు, కక్ష సాధించడం నా కుటుంబానికి అలవాటు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పని పైసాతో నడిచే రాజకీయాలు తాను చేయాలేనని.. ప్రస్తుతం విలువలతో కూడిన రాజకీయాలు లేవన్నారు. రాజకీయాలలో లేకున్న ప్రజాసేవ చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed