- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Politics:పన్నెండు రోజుల్లో సైకో పాలన అంతం అవుతుంది : నారా లోకేష్
దిశ,ఒంగోలు:రాష్ట్రంలో మార్పు ఒంగోలు నుంచి మొదలైందని 12 రోజుల్లో సైకో పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ తెలిపారు. ఒంగోలు గుంటూరులో యువగళం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో ఉద్యోగాలు లేవని రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. ఒక్క అవకాశం అనే మాటకు పడిపోయి యువత జగన్ ని గెలిపించి నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని.. ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిందని తెలిపారు. అనంతపురం జిల్లాలో కార్లు తయారు చేసే పరిశ్రమను తీసుకు వచ్చామని..ఆగిపోయిన అమరావతి రాజధాని పనులను ఒక్క నెల తర్వాత ప్రారంభిస్తామన్నారు. మనకు బ్రాండ్ ఉంది. దాని పేరు చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్‌ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని నారా లోకేష్ స్పష్టం చేశారు. అనంతపురానికి పరిశ్రమను చంద్రబాబు తీసుకు వచ్చారన్నారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని..మైక్ పట్టుకుని మాట్లాడే పరిస్థితి కూడా ఏపీలో లేదన్నారు. వెలిగొండ ద్వారా సాగు, తాగు నీరు అందించే బాధ్యత తీసుకుంటామని.. పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకు అధికంగా నిధులు ఖర్చు చేశామని చెప్పారు.
దామచర్ల జనార్దన్ ఆద్వర్యం లో 2600 కోట్లతో ఒంగోలు అభివృద్ధి కోసం ఖర్చు చేశామని లోకేష్ తెలిపారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని..ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేశంలోనే అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ ని గెలిపించాలని లోకేష్ అన్నారు.