- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ కేంద్రాలకు కనీస వసతులు కల్పించండి: జాయింట్ కలెక్టర్
దిశ ప్రతినిధి, అనకాపల్లి : పోలింగ్ కేంద్రాలకు విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం వంటి కనీస వసతులు సమకూర్చాలని జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం తహశీల్దార్, సెక్టర్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఉన్న సౌకర్యాలపై కచ్చితమైన సమాచారం అందించాలని అన్నారు.సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది రవాణాకు అవసరమైన బస్సులు, జీపులకు ప్రతిపాదనలు ఇచ్చారని, ఆయా రూట్లలో బస్సులు జీపులు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించాలని సూచించారు. పోలింగ్ అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన వెలుతురు ఉండే విధంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.
మరుగుదొడ్లు లేక పోతే కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడానికి నిధులు విడుదల చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రూ.20 వేల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్ ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత మరో రూ.10 వేలు విడుదల చేస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల పైకప్పులు సక్రమంగా లేక పోతే మరమ్మతులు చేయడానికి నిధులు ఇస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో పొలిటికల్ పార్టీ కార్యాలయాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. అంబేద్కర్, పాడేరు నియోజకవర్గంలో తహశీల్దార్, సెక్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.