అన్నవరం అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన

by Jakkula Mamatha |
అన్నవరం అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన
X

దిశ,అన్నవరం : దేశవ్యాప్తంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.ఇందులో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంను మరింత అభివృద్ధి పరిచేందుకు కేటాయించిన రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కొండపైన వార్షిక కళ్యాణ వేదిక ఎదురుగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. దేవస్థానం కొండపై రత్నగిరి, సప్తగిరులపై వివిధ అభివృద్ధి పనులను శాశ్వతంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

2021లో సుమారు రూ.94 కోట్ల ప్రతిపాదనలు అంచనాలు తయారు చేయగా 2022లో ఇక్కడి స్థల పరిశీలనకు కేంద్ర టూరిజం శాఖ బృందం, ఇంజనీర్ల బృందం విచ్చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. పలుమార్లు చర్చలు అనంతరం ఎట్టకేలకు అన్నవరం దేవస్థానం కొండపై శాశ్వత నిత్య అన్నదాన భవనం, స్వామివారిని దర్శించుకునే క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, టాయిలెట్లు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలు చేపట్టేందుకు తొలి విడతగా రూ.20 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఇక్కడ అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయడంతో కాకినాడ ఎంపీ వంగా గీత, దేవస్థానం చైర్మన్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు శంకుస్థాపన కార్యక్రమాన్నినిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed