- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ ఆఫీస్‌లోనే చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ తయారీ ..బెయిల్ కోసం డ్రామాలు?: మంత్రి సీదిరి అప్పలరాజు
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం మెడికల్ రిపోర్ట్‌లను తయారు చేయించారని ఆరోపించారు. స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు మానవతా దృక్ఫథంతో హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. పలాసలో శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తరఫు న్యాయ వాదులు అఫిడవిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప..ఎక్కడా తప్పు చేయలేదని చెప్పలేదని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. న్నారు.
మెడికల్ రిపోర్ట్స్ తప్పుల తడక
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని ఎల్లో మీడియా వార్తలు రాసిందని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. అంతేకాదు చనిపోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భవనేశ్వరి యాత్రలు సైతం చేపట్టారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాక ఆ యాత్రలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని తామూ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించానని...అది తప్పుల తడకగా ఉందన్నారు. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఏ డాక్టర్ కూడా కంటి ఆపరేషన్ చేయరని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు ఇన్ని డ్రామాలు ఆడాలా అని నిలదీశారు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదని చెప్పుకొచ్చారు. ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి అందజేశారని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన ఆరోపణలు చేశారు.