Prakash Raj : పవన్ కల్యాణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
Prakash Raj : పవన్ కల్యాణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan )పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) మరోసారి విరుచుక (Once Again Fires) పడ్డారు. పవన్ కళ్యాణ్ కు కొంచెమైనా సిగ్గు ఉందా? ఓ తమిళ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన పవన్ కల్యాణ్ సనాతన ధర్మం..బీజేపీ అనుకూల వైఖరులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. చెగువేరా, పెరియార్, గద్దర్ కి బీజేపీతో సంబంధం ఏంటని? ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కు సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వారంత బీజేపీ సైద్దాంతిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేశారని..వారందరిని బీజేపీ అనుకూల వైఖరితో ఉండే పవన్ కల్యాణ్ స్మరించడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని వాదన దుష్ర్పచారమేనని..ప్రమాదంలో ఉన్నది బీజేపీ వాదమేనని ఎద్దేవా చేశారు.

సినిమాల్లో కలిసి నటించిన పవన్, ప్రకాష్ రాజ్ లు రాజకీయంగా పరస్పరం తరుచు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తరచు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తునే ఉన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపైన కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్వీట్ వార్ సాగింది. ఇటీవల తమిళనాడులో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్‌పై విమర్శించారు.

అనంతరం ఓ ఇంటర్వ్యూలోనూ పవన్ విధ్వంస రాజకీయాలకు తెర తీస్తున్నారని..ఆయనను ఓట్లు వేసిన ఎన్నుకున్నది మ‌త‌ప‌రంగా విడదీసి, విధ్వంస రాజకీయాలు చేయ‌డానికి కాదు కదా? ఈ విషయాలను ప్రశ్నించడానికి ఒక్కరుండాలని..ఆ పని నేను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed