- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Accident: బస్సులో 20 మంది.. కొద్దిలో మిస్.. !

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా సింగరాయకొండ(Singarayakonda)లో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. అదుపుతప్పి లారీ(Lorry)ని ట్రావెల్స్ బస్సు(Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపాటు గురయ్యారు. లారీని ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. కొద్దిలో ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు.
అతివేగమే కారణమా..?
విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద స్థలం నుంచి లారీ, బస్సును పక్కకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
వాహనదారులకు కీలక సూచనలు
ఇక వాహనదారులకు కీలక సూచన చేశారు. అతి వేగం ప్రమాదకరమని సూచించారు. డ్రైవర్లు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సూచించారు. డ్రైవర్ల వద్ద లైసెన్స్ కాపీలు ఉండాలని, రోడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. మందు తాగి డ్రైవింగ్ అసలు చేయొద్దని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమితే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.