- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం జగన్ సర్పంచుల పీక నొక్కుతున్నారు: జీ వీరభద్రాచారి

X
దిశ, దక్షిణ కోస్తా: ముఖ్యమంత్రి జగన్ అందరికీ బటన్ నొక్కి డబ్బులేస్తున్నారని, కానీ సర్పంచుల పీక నొక్కుతున్నారంటూ ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జీ వీరభద్రాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్యకు కారణమేనని తమ విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఆమె మరణం అనంతరమైనా బిల్లుల చెల్లింపునకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారిని విచారణాధికారిగా నియమించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పంచాయతీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి చొరక చూపాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
Next Story