కనిగిరిని అభివృద్ధి చేసి చూపిస్తా: ఉగ్ర నరసింహారెడ్డి

by srinivas |   ( Updated:2024-02-01 16:45:44.0  )
కనిగిరిని అభివృద్ధి చేసి చూపిస్తా: ఉగ్ర నరసింహారెడ్డి
X

దిశ, కనిగిరి: సరైన పాలకుడిని ఎన్నుకొకపోతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, కనిగిరి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి టీడీపీ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి టిడిపి కార్యకర్త 100 ఓట్లకు బాధ్యత తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. కనిగిరి నియోజకవర్గంలో పార్టీ విజయం సాధిస్తే ఐదు గ్యారెంటీలను అమలు హామీ ఇచ్చారు. వైసీపీ అరాచక పాలన, విధ్వంసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టాప్ 5లో నిలిచిన బూత్ ఇన్చార్జ్ లకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

Advertisement

Next Story