- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: దీనికి రేవంత్, అసదుద్దీన్ బాధ్యత వహించాలి.. ఎంపీ రఘునందన్ రావు
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ దాడికి రేవంత్, అసదుద్దీన్ బాధ్యత వహించాలని, ఈ దాడితో కాంగ్రెస్ పతనం మొదలైందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office) వద్ద జరిగిన ఘటనపై స్పందిస్తూ.. సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు, రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి(Revanth Reddy), అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) బాధ్యత వహించాలని అన్నారు.
నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారని ఆరోపించారు. గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం, మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమేనని, బీజేపీ కార్యాలయం పై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారని, కానీ నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అంతేగాక తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని, గుండాలకు రౌడీషీటర్లకు ఉగ్రవాదులకు నక్సలైట్లకు పూర్తి స్వేచ్చని ఇచ్చి, తెలంగాణను కుక్కలు చంపిన విస్తరి చేయమని సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyank Gandhi)లు చెప్పారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులకు పీసీసీ అధ్యక్షుడు(PCC Chief), ముఖ్యమంత్రి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మా ఓపికను, సహనాన్ని పరీక్షించాలి అనుకుంటే అది మీ ఇష్టం అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం బీజేపీ కార్యాలయంపై దాడితో మొదలైంది గుర్తుపెట్టుకోవాలని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు.