ఆ పాటలా పవన్‌ కల్యాణ్ పరిస్థితి అవుతుంది.. కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఆ పాటలా పవన్‌ కల్యాణ్ పరిస్థితి అవుతుంది.. కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల తర్వాత ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశారు’ అనే పరిస్థితి పవన్‌కు అవుతుందని ఆయన సెటైర్లు వేశారు. విశాఖ అసిల్మెట్టలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. పవన్ స్థాపించిన జనసేన అవినీతి పార్టీ అంటూ ఆరోపించారు. చంద్రబాబుపైనా కేఏ పాల్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలించిన 14 ఏళ్లలో చాలా అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, అందుకే ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని తాను కోరుతున్నానని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏపాల్ పేర్కొన్నారు.

కాగా వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి ఏపీలో పోటీ చేయబోతోంది. ఈ మేరకు పార్టీ తరపున అభ్యర్థులను ఆయన పరిశీలిస్తున్నారు. గతంలోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేసింది. అయితే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. చివరకు ఆయన సైతం ఓడిపోయారు. మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో మరోసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

Next Story