జగన్‌‌ను చంపేందుకే దాడి చేశారు.. నిందితుడి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

by Disha Web Desk 16 |
జగన్‌‌ను చంపేందుకే దాడి చేశారు.. నిందితుడి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్‌లో రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించారు. కీలక నిందితుడు సతీశ్‌ను కోర్టులో ప్రవేశ‌పెట్టారు. నిందితుడు సతీశ్ రిమాండ్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. మరికాసేపట్లో సతీశ్ రిమాండ్ పై జడ్జి తీర్పు ఇవ్వనున్నారు. అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పొందుపర్చారు. సీఎం జగన్‌పై దాడి కేసులో కాల్ డేటా, సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

‘ప్రత్యక్షులు సాక్ష్యం చెప్పిన ప్రకారం నిందితుడి సతీశ్‌ని అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ నెల 17న విజయవాడ రాజరాజేశ్వరిపేటలో నిందితుడిని అరెస్ట్ చేశాం. వెంటనే సతీశ్ ఫోన్ ను సీజ్ చేశాం. ఏ2 ప్రోద్బలంతో నిందితుడు దాడి చేసినట్లు గుర్తించాం. సీఎం జగన్‌ను చంపేందుకే పదునైన రాయి విసిరారు. దాడి ఘటన వెనుక హత్య చేయాలనే ఉద్దేశం ఉంది. కరెంట్ లేని సమయం చూసి జగన్ తలపై కాంక్రీట్ రాయితో దాడి చేశారు.’ అని పోలీసులు నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

Next Story

Most Viewed