Kodi Pandelu: సంక్రాంతికి ముందే కోడిపందాలు.. భారీగా నగదు స్వాధీనం

by Rani Yarlagadda |
Kodi Pandelu: సంక్రాంతికి ముందే కోడిపందాలు.. భారీగా నగదు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti 2025) అనగానే గుర్తొచ్చేది ఆంధ్రా పల్లెటూళ్లు. అంటే మిగతా ప్రాంతాల్లో చేయరా అనుకోకండి. చేస్తారు కానీ.. ఆంధ్రప్రదేశ్ లో.. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో (Godavari Districts) నిర్వహించే కోడిపందేలు సంక్రాంతి ప్రత్యేకం. ఈ విషయం అందరికీ తెలుసు. కోడిపందేలపై ఎన్ని ఆంక్షలున్నా సరే.. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి మరీ.. కోట్లలో పందెంలు కాస్తుంటారు. కోడిపందేలు లేకపోతే అసలు సంక్రాంతి సందడే కనిపించదు మరి.

సంక్రాంతికి ఇంకా నెలరోజుల పైగానే టైం ఉండగా.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు ఊపందుకున్నాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేసి పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి, నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం (Koyyalagudem) మండలం గవరవరంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేశారు. గత అర్థరాత్రి దాడులు చేసి.. 20 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,23,210 నగదు, 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story