Breaking: చీరాల దారుణం.. గంజాయి బ్యాచ్ పనే

by srinivas |   ( Updated:2024-06-22 16:16:11.0  )
Breaking: చీరాల దారుణం.. గంజాయి బ్యాచ్ పనే
X

దిశ, వెబ్ డెస్క్: యువతిపై అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను మరో ఇద్దరి సహకరించారలని తెలిపారు. ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్లని పోలీసులు పేర్కొన్నారు.

కాగా ఈపురుపాలెంలో యువతి హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం వివస్త్రగా ఉండటం, ఒంటిపై గాయాలు ఉండటంతో అత్యాచారానికి గురైనట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బాధితురాలి కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఘటనపై సీరియస్ అయ్యారు. 48 గంటల్లో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఈపురుపాలెం సీతారాంపేటకు చెందిన యువతి చదివి టైలరింగ్ నేర్చుకున్నారు. ఇంటి వద్దే ఉండి దుస్తులు కుడుతున్నారు. శుక్రవారం వేకువజామున ఎప్పటిలాగే ఆమె బహిర్భూమికి వెళ్లారు. అయితే ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టూ గాలించారు. ఈపురుపాలెం బాలికల హైస్కూల్ పక్కన చెట్ల పొదల్లో యువతి మృతదేహం కనిపించింది. యువతి ముఖం, ఒంటిపై గాయాలున్నాయి. దీంతో పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హోంమంత్రి చెప్పినట్లే 48 గంటల్లో ఛేదించారు.

Advertisement

Next Story

Most Viewed