- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: కస్టడీకి పిన్నెల్లి.. ఆ కేసుల్లో ప్రశ్నల వర్షం
దిశ, వెబ్ డెస్క్: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మాచర్ల సీఐపై హత్యాయత్నం, ఈవీఎం ధ్వంసం కేసుల్లో ఈ ఉదయం ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. ఆ రెండు కేసుల్లో పిన్నెల్లి పాత్రపై లాయర్ల సమక్షంలో విచారిస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఆయనను.. రెండు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఇందులో భాగంగా మరింత విచారణ చేస్తున్నారు. ‘ సీఐపై ఎందుకు హత్యాయత్నం చేయబోయారు.. ఈవీఎంను ఎందుకు ధ్వంసం చేశారు..? అసలు ఆ సమయంలో ఏం జరిగింది.’ అనే అంశాలపై పిన్నెల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
కాగా మే 13న ఏపీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. అనంతరం స్థానిక సీఐపై ఆయన దాడి చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగిన అల్లర్లలోనూ పిన్నెల్లి రెచ్చిపోయారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసులు నమోదు చేయాలని పోలీసులను అదేశించింది. దీంతో పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ సమయంలో పలు కేసుల్లో పిన్నెల్లి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన కేసుల్లో పిన్నెల్లికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో మరింత లోతుగా విచారించేందుకు పిన్నెల్లిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరారు. దీంతో ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా పిన్నెల్లిని పోలీసులు సోమవారం ఉదయం 10 గంటలకు కస్టడీకి తీసుకున్నారు.