- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు కోసం రాస్తారోకో.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
దివ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రోడ్డు కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గతంలో శ్రీకాకుళం-ఆముదాలవలస మధ్యలో రోడ్డు పనులు ప్రారంభించారు. కొంత మేర రోడ్డు పనులు చేపట్టారు. ఏమైందో ఏమోగాని ఆ తర్వాత పనులు పూర్తి చేయలేదు. నిర్మాణ మధ్యలో నిలిపివేశారు. దీంతో రోడ్డుపై వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గోతులు, కంకర పైకి తేలడంతో వాహనాలు స్కిడ్ అయి బోల్తా పడుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా కొందరికి తీవ్ర గాయాలయి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో స్థానిక ప్రజలు ఆదివారం నిరసనకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని నిలదీశారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని.. లేని పక్షంలో ఎన్నికల్లో గుణపాఠం చెబుదామని హెచ్చరించారు.