- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Breaking: టీడీపీ తిట్లు వైసీపీకి ఆశీర్వాదాలు..పెద్దిరెడ్డి
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. కాగా మాటకు మాట అన్నట్లు వైసీపీ నేతలు చంద్రబాబు ఆరోపణల పైన ప్రతిదాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా తిడితే జగన్ కు అంత ఆశీర్వాదం అని పేర్కొన్నారు. ఇక గతంలో వైసీపీ సాధించిన సీట్ల కంటే రానున్న ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అసలు చంద్రబాబుకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశించారు. ఇక వైసీపీ నుండి తీసేసిన పనికారాని వాళ్ళను టీడీపీ అధినేత తన పార్టీలోకి తీసుకుంటున్నాడని సెటైర్లు వేశారు. ఇక తాను 2009లో ఫారెస్ట్ మంత్రిగా విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలానే తన హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న మొదటి వ్యక్తి తానేనని గుర్తు చేసుకున్నారు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణా చంద్రబాబు హయాంలో ఎక్కువగా జరిగిందని ఆరోపణల జల్లు కురిపించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్వాలిటీ లీడర్ షిప్ ఉందని.. చంద్రబాబు ఏ విధంగానూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి దీటు రాడని వ్యాఖ్యానించారు.
Read More..
సీఎం జగన్ పాలనను భరించే స్థితిలో జనం లేరు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు