శాంతిస్తున్న కృష్ణమ్మ..లంక గ్రామాలకు తప్పిన ముప్పు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-03 15:25:44.0  )
శాంతిస్తున్న కృష్ణమ్మ..లంక గ్రామాలకు తప్పిన ముప్పు
X

దిశ, డైనమిక్​బ్యూరో:కృష్ణా నది వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. బెజవాడలో కృష్ణమ్మ శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజి ఇన్‌ఫ్లో నిన్న 11 లక్షల క్యూసెక్కులు ఉండగా నేడు 8.64 లక్షల క్యూసెక్కులకు చేరింది. అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ వరద తగ్గుముఖం పట్టింది. పునరావస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. బుడమేరులోనూ వరద ప్రవాహం తగ్గింది. వరద ప్రవాహం తగ్గడంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఎటువంటి గండ్లు పడకపోవడంతో పెను విపత్తు తప్పింది. ముఖ్యంగా వరద ఉధృతి తగ్గుతుండడంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

లంక గ్రామాల్లో తప్పిన ముప్పు

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్​, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తదితరులు రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద తగ్గడంతో రేపల్లెలో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed