పిఠాపురం నుంచి పవన్ పోటీ..టీడీపీ జెండాలు, ప్లెక్సీలు తగలబెట్టిన నేతలు

by Mahesh |   ( Updated:2024-03-14 14:04:33.0  )
పిఠాపురం నుంచి పవన్ పోటీ..టీడీపీ జెండాలు, ప్లెక్సీలు తగలబెట్టిన నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నో సీట్లను కూడా త్యాగం చేశారు. పొత్తులో భాగంగా జనసేనాని పోటీ చేసే స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో ఓడిపోయిన రెండు ప్రాంతాల్లో ఒక దాని నుంచి పవన్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం ఇరుపార్టీలు అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

కానీ.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అయిన ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. పిఠాపురం నుంచి వర్మకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. అలాగే కోపంతో ఊగిపోతూ.. టీడీపీ ఫ్లేక్సీలు, జెండాలను తగలబెట్టారు. నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున చేరుకుని తమ నాయకుడైన వర్మకే టికెట్ కేటాయించాలని నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More..

పవన్‌పై పోటీకి రామ్‌గోపాల్ వర్మ సై.. సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed