మద్యం నిషేధిస్తామని జగన్ సారా వ్యాపారిగా మారారు..పవన్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |   ( Updated:2024-04-18 14:10:16.0  )
మద్యం నిషేధిస్తామని జగన్ సారా వ్యాపారిగా మారారు..పవన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: మద్యం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సారా వ్యాపారిగా మారిపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బుధవారం కృష్ణా జిల్లా పెడనలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన చీఫ్ , టీడీపీ అధినేత పాల్గొన్నారు.మద్యం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సారా వ్యాపారిగా మారిపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బుధవారం కృష్ణా జిల్లా పెడనలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన చీఫ్ , టీడీపీ అధినేత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరు ప్రసంగించారు. సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా జగన్ రూ.40 వేల కోట్లు సంపాదించి వాటితో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని పవన్ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు ఐదేళ్లలో పది సార్లు పెంచారు.

అంతేకాదు పెడనలో ఎదైనా పని జరగలంటే ఇక్కడి ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని, మట్టి మాఫియా పై ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారని విమర్శించారు. పట్టాదారు పాస్ బుక్ కావాలంటే రూ.10వేలు అడిగే ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం యువతకు ఉపాధి అవకాశాలు రావని చెప్పారు. మత్స్యకారుల పొట్ట కొట్టే 217 జీవోను వైసీపీ ప్రభుత్వం తెచ్చిందన్నారు. మున్సిపల్ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధి హామీలో ఎక్కువ అక్రమాలు జరిగింది ఏపీలోనే అని కేంద్ర మంత్రి చెప్పారు. కృష్ణా నదిలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం వల్ల ఈ జిల్లాలో 71 మంది చనిపోయారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read More..

షర్మిల, సునీతకు బిగ్ షాక్.. వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed